IPL: అనూహ్య ‘నో బాల్’..
IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?నిన్న MI, SRH మ్యాచ్లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్ను బంతి తాకక ముందే కీపర్ గౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లోవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.10

భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.10తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారు.క్వింటా కనీస ధర రూ.800, గరిష్ఠ ధర రూ.1,480 పలుకుతోంది. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉంది. ఈ సీజన్లో సాగు పెరగడం, క్వాలిటీ లేకపోవడం ధరల పతనానికి కారణాలుగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర రూ.1,500 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-20గా ఉంది.
Leave a Reply